1,000 మందిపై చర్యలు -సిఇఓ ముఖేష్‌కుమార్‌ మీనా

Apr 3,2024 07:28 #CEO Mukesh Kumar Meena, #speech

డిల్లి:ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ రాష్ట్రంలో ఇప్పటివరకు వెయ్యి మందిపై చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. తనన కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ చర్యలు తీసుకున్న వారిలో 556 మంది వాలంటీర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికల నియమావళికి భిన్నంగా ఒక పార్టీకి ప్రచారం చేస్తున్నందుకుగానూ వీరిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రేషన్‌ షాపులు నిర్వహణ తదితర ప్రభుత్వ అనుబంధ కార్యక్రమాల్లో ఉన్న మరో 61 మంది రాజకీయ ప్రచారాలు, ప్రదర్శనల్లో పాల్గన్నట్లు తేలడంతో వారిపై కూడా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ పద్దతుల్లో ఉద్యోగాలు చేస్తున్న 140 మందిని విధుల నుండి తొలగించినట్లు తెలిపారు. 96 మంది రెగ్యులర్‌ ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని, వీరిలో కొందరిని సస్పెండ్‌ చేసినట్లు సిఇఓ తెలిపారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటించాలని ఆయన కోరారు.

➡️