అద్వానీకి భారతరత్న ప్రదానం

Apr 1,2024 09:06 #adwani, #bharatharatna

న్యూఢిల్లీ : మాజీ ఉప ప్రధాని, బిజెపి సీనియర్‌ నాయకుడు ఎల్‌కె అద్వానీకి ‘భారతరత్న’ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ప్రదానం చేశారు. అనారోగ్య సమస్యల కారణంగా శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన హాజరుకాలేకపోయారు. దీంతో, రాష్ట్రపతి ఆయన నివాసానికి ఆదివారం వెళ్లి పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.

➡️