గౌతం గంభీర్‌ బటలోనే ఎంపి జయంత్‌సిన్హా

Mar 2,2024 16:12 #jayanth sinha

న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ జయంత్‌ సిన్హా కూడా గౌతం గంభీర్‌ బాట పట్టారు. క్రికెట్‌పై ఫోకస్‌ పెట్టేందుకు తనను రాజకీయాల నుంచి తప్పించాలని గంభీర్‌ బిజెపి నాయకత్వాన్ని కోరుకున్నారు. రాజకీయాల్లో అవకాశం కల్పించినందుకు ప్రధాని మోడీ, మంత్రి అమిత్‌ షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. అలాగే బిజెపి ఎంపీ జయంత్‌ సిన్హా కూడా తనను ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని నడ్డాను కోరారు. గ్లోబల్‌ వార్మింగ్‌ అంశంపై ఫోకస్‌ పెట్టేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీ జయంత్‌ ఈరోజు ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. ఆర్థిక, పరిపాలనా అంశాల్లో మాత్రం పార్టీతో కలిసి పనిచేయనున్నట్లు ఆయన తెలిపారు.

 

➡️