సిక్కింలో 800 పర్యాటకులను రక్షించిన సైన్యం

Dec 14,2023 11:26 #Indian Army, #Sikkim, #Tourists

 గ్యాంగ్‌టక్‌  :   తూర్పు సిక్కింలోని ఎత్తైన ప్రాంతంలో చిక్కుకుపోయిన 800 మందికి పైగా పర్యాటకులను భారత సైన్యం బుధవారం రక్షించిందని అధికారులు తెలిపారు.  హిమపాతం, ప్రతికూల వాతావరణం కారణంగా తూర్పు సిక్కింలోని వివిధ ప్రాంతాలలో వృద్ధులు, మహిళలు మరియు పిల్లలతో సహా పర్యాటకులు చిక్కుకుపోయారని అన్నారు. భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్‌ రెస్క్యూ మిషన్‌ సహాయక చర్యలను చేపట్టిందని, బుధవారం సాయంత్రం సమయానికి ప్రత్యేక వాహనాల్లో వారిని సురక్షిత ప్రాంతానికి తరలించిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో హిమపాతం అధికంగా ఉండటంతో సిక్కిం వచ్చే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.

➡️