మణిపూర్‌లో సహచరులపై కాల్పులు.. తనని తాను కాల్చుకున్న జవాన్‌

Jan 24,2024 12:30 #Assam Rifles jawan, #Manipur

ఇంఫాల్‌ :    మణిపూర్‌లో ఓ జవాన్‌ తన సహచరులపై కాల్పులు జరిపిన అనంతరం తనను తాను కాల్చుకున్నారు. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఆరుగురు జవాన్‌లకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. దక్షిణ మణిపూర్‌లోని భారత్‌ -మయన్మార్‌ సరిహద్దుకు సమీపంలో మోహరించిన పారామిలటరీ దళానికి చెందిన బెటాలియన్‌లో అస్సాం రైఫిల్స్‌ జవాన్‌ ఈ కాల్పులు జరిపారు. జవాన్ మరణించారని అధికారులు తెలిపారు.   కార్మికుల పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు.

సమీప జిల్లాకు చెందిన ఈ జవాన్‌ జనవరి 20న సెలవుల నుండి తిరిగి విధుల్లోకి వచ్చారని పోలీసులు తెలిపారు. గాయపడిన జవాన్లందరూ మణిపురీయేతరులని  అన్నారు. దీంతో ఈ ఘటనకు మణిపూర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చని భావిస్తున్నట్లు అస్సాం రైఫిల్స్‌ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని అన్నారు.

➡️