బర్డ్‌ ఫ్లూ వైరస్‌ పట్ల అప్రమత్తంగా వుండాలి

Jun 1,2024 08:45 #Be alert, #bird flu virus

రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : ఇళ్లలో పెంచుకునే పక్షులు, కోళ్లు వంటివి అసాధారణ రీతిలో మరణిస్తే అప్రమత్తతతో వెంటనే ఆ సమాచారాన్ని పశు సంవర్ధక శాఖ అధికారులతో పంచుకోవాల్సిందిగా కేంద్రం, రాష్ట్రాలను ఆదేశించింది. అటువంటపుడు అవియన్‌ ఇన్‌ఫ్లూయంజా (బర్డ్‌ ఫ్లూ వైరస్‌)కు రూపొందించిన జాతీయ కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా ప్రజారోగ్య కార్యాచరణను చేపట్టడానికి వీలుంటుందని పేర్కొంది. జాతీయ వ్యాధి నియంత్రణా కేంద్రం (ఎన్‌సిడిసి), కేంద్ర పశు సంవర్ధక శాఖ కలిసి ఈ నెల 25న సంయుక్తంగా ఒక ప్రకటన జారీ చేశాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ (నెల్లూరు), మహారాష్ట్ర (నాగ్‌పూర్‌), కేరళ (అలప్పూజ, కొట్టాయం, పతనంతిట్ట జిల్లాలు), జార్ఖండ్‌ (రాంచి) రాష్ట్రాల్లోని కోళ్లల్లో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ పెచ్చరిల్లినట్లు వార్తలు వచ్చాయి. వ్యాధిని మానవులకు సంక్రమింపచేసే సామర్ధ్యం ఈ వైరస్‌కు వుందని, అందువల్ల ఈ ఇన్ఫెక్షన్‌ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని ఆ ప్రకటన పేర్కొంది. సాధారణంగా వలస పక్షుల నుండే ప్రధానంగా ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుంది.

➡️