Bihar : కానిస్టేబుల్‌ను ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన ఇసుక మాఫియా

పాట్నా :    బీహార్‌లో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఔరంగాబాద్‌ జిల్లాలో ఓ కానిస్టేబుల్‌ను ట్రాక్టర్‌తో తొక్కించి చంపినట్లు పోలీసులు తెలిపారు. దౌద్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ముసేపూర్‌ ఖైరా గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరిగింది.

వివరాల ప్రకారం.. భోజ్‌పూర్‌ జిల్లాలోని అర్రాV్‌ా గ్రామానికి చెందిన దీపక్‌ కుమార్‌ (29) కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇసుక మైనింగ్‌లో తనిఖీ చేస్తుండగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను నిలువరిచేందుకు యత్నించారు. వాహనాన్ని ఆపాలని డ్రైవర్‌కు సూచించారు. అయితే డ్రైవర్‌ దీపక్‌ కుమార్‌ను ట్రాక్టర్‌తో తొక్కించి.. అక్కడి నుండి పరారయ్యాడు. వెంటనే సమీప ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారని ఔరంగాబాద్‌ ఎస్‌పి తెలిపారు.

ట్రాక్టర్‌ సీజ్‌ చేసి, యజమానిని అదుపులోకి తీసుకున్నామని ఎమ్మెల్యే మెష్రామ్‌ తెలిపారు. డ్రైవర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారని అన్నారు.

గతేడాది నవంబర్‌లో జమయి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న దుండగులు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, హోంగార్డును తీవ్రంగా కొట్టిన సంగతి తెలిసిందే.

➡️