గోద్రా సబ్‌ జైలులో లొంగిపోయిన బిల్కిస్‌ బానో కేసు దోషులు

Jan 23,2024 11:10 #Bilkis Bano Case, #Godhra Sub Jail

అహ్మదాబాద్‌ :  బిల్కిస్‌ బానో కేసులో 11 మంది దోషులు గుజరాత్‌లోని పంచమహల్‌ జిల్లాలో గల గోద్రా సబ్‌జైలులో లొంగిపోయారు. గుజరాత్‌ ప్రభుత్వం దోషులుకు మంజూరు చేసిన రెమిషన్‌ను భారత సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 8న రద్దు చేసిన విషయం విదితమే. రెండు వారాల్లో జైలు అధికారుల ముందు లొంగిపోవాలని ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు దోషులు సబ్‌ జైలులో సరెండరయ్యారు.

➡️