బీహార్‌లో బిజెపిని అడ్డుకుంటాం : తేజస్వి యాదవ్‌

Feb 12,2024 17:00 #Bihar, #Tejashwi Yadav

పాట్నా : బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌ మరణానంతరం ఇటీవల ఆయనకు కేంద్రం భారతరత్న అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారతరత్న అవార్డులపై బిజెపి ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుందని బీహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్‌ కేంద్రంపై విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన విధాన సభలో మాట్లాడుతూ.. ‘కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న అవార్డు లభించినందుకు నేను సంతోషిస్తున్నాను. బిజెపి వాళ్లు మాతో ఒప్పందం కుదుర్చుకుంటే.. మీకు భారతరత్న అవార్డును ఇస్తాం అనే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.’ అని తేజస్వియాదవ్‌ అన్నారు. ఈరోజు నితీష్‌కుమార్‌ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కొనుంది. బలపరీక్షలోల నెగ్గేవిధంగా నితీష్‌కి ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ సందర్భంగా బీహార్‌ విధాన సభలో తేజస్వియాదవ్‌ మాట్లాడుతూ.. ‘వరుసగా తొమ్మితోసారి సిఎంగా ప్రమాణస్వీకారం చేసి చరిత్ర లిఖించినందుకు నితీష్‌కుమార్‌ని అభినందిస్తున్నాను. మేము నితీష్‌కుమార్‌ని ఎప్పుడూ గౌరవిస్తాము. మీరు సిఎం పదవికి రాజీనామా చేసి విధాన సభ నుండి బయటకు వస్తున్నప్పుడు మేము అక్కడ నృత్యం చేయడానికో, పాట పాడటానికికో కాదు అని అన్నారు. అయినా మేము మీకు మద్దతుగా ఉన్నాము. నేను నితీష్‌కుమార్‌ అల్లుడినే. కానీ బీహార్‌లో బిజెపి జోక్యాన్ని నేను అడ్డుకుంటాను. మిమ్మల్ని (నితీష్‌కుమార్‌) మా కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నాం. మేము సమాజ్‌వాదీ కుటుంబానికి చెందినవాళ్లం. బిజెపిని దేశవ్యాప్తంగా అడ్డుకునేందుకు మీరు ఎగరవేసిన జెండా.. ఇప్పుడు మీ మేనల్లుడు ఆ జెండాను మోసి బీహార్‌లో మోడీని అడ్డుకుంటాడు.’ అని అన్నారు. ఇక ఈ సందర్భంగా ‘జెడియు ఎమ్మెల్యేలంటే నాకెంతో బాధగా ఉంది. ఎందుకంటే వారు ప్రజల్లోకి వెళ్లి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నితీష్‌కుమార్‌ ఒకే టర్మ్‌లో మూడుసార్లు ప్రమాణస్వీకారం ఎందుకు చేశారంటూ ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరేం సమాధానం చెబుతారు? ఇంతకుముందు మీరు బిజెపి వారిని విమర్శించారు. ఇప్పుడు వారిని పొగుడుతున్నారు. వారికి మీరు ఏమి చెబుతారు?’ అని తేజస్వి ప్రశ్నించారు.

➡️