బెంగళూరు: బెంగళూరులోని ప్రముఖ హౌటల్ ఒట్టేరా సహా మరో రెండింటికి బెదిరింపులు వచ్చాయి. ఒక ఈ-మెయిల్ అడ్రస్ నుంచి ఇవి వచ్చినట్లు హౌటల్ యాజమాన్యాలు తెలిపాయి. నేడు ఆ హౌటళ్లు పేల్చివేస్తామని దీనిలో హెచ్చరించినట్ల వారు తెలిపారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు రంగంలోకి దిగి ముమ్మర తనిఖీలు చేపట్టాయి. వీటి సమీప ప్రాంతాల్లో భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. ఇంతవరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులను గుర్తించలేదని.. తనిఖీలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/bomb-2.jpg)