Bypoll పంజాబ్‌లోని జలంధర్‌ వెస్ట్‌ అభ్యర్థిగా మహీందర్‌ భగత్‌ : ఆప్‌

చండీగఢ్‌ :    పంజాబ్‌లోని జలంధర్‌ వెస్ట్‌(ఎస్‌సి) అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా మహీందర భగత్‌ పోటీ చేయనున్నట్లు ఆప్‌ సోమవారం ప్రకటించింది. దీంతో ఉప ఎన్నికలకు అభ్యర్థిని ప్రకటించిన మొదటి ప్రధాన పార్టీ ఆప్‌ కానుంది. ఆప్‌ పార్టీ ఎమ్మెల్యే శీతల్‌ అంగురాల్‌ రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆమె ప్రస్తుతం బిజెపిలో చేరారు.

జలంధర్‌ వెస్ట్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌కు జులై 10న ఉప ఎన్నిక జరగనుండగా, జులై 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. నామినేషన్ల దాఖలు జూన్‌ 21 చివరితేదీ. జూన్‌ 24న నామినేషన్లను పరిశీలించనున్నారు. జూన్‌ 26 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ.

మహీందర్‌ భగత్‌ గతేడాది బిజెపి నుండి ఆప్‌లో చేరారు. ఆయన మాజీ మంత్రి భగత్‌ చున్నిలాల్‌ కుమారుడు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో జలంధర్‌ వెస్ట్‌ నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

➡️