మరో ఐదు ఎన్‌జిఒలపై కేంద్రం వేటు – ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్స్‌ల రద్దు

Apr 3,2024 23:59 #FCRA registration, #NGOs

న్యూఢిల్లీ : స్వస్ఛంద సంస్థలకు నిధుల దక్కనీయకుండా ఆంక్షలు విధిస్తూ వచ్చిన మోడీ సర్కార్‌ తాజాగా మరో ఐదు ఎన్‌జిఒలపై వేటు వేసింది. చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపిస్తూ సిఎన్‌ఐ సినాడికల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సోషల్‌ సర్వీస్‌, వాలంట్రీ హెల్త్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఇండో-గ్లోబల్‌ సోషల్‌ సర్వీస్‌ సొసైటీ, చర్చీస్‌ ఆక్సలరీ ఫర్‌ సోషల్‌ యాక్షన్‌, ఎవాంగ్లికల్‌ ఫెలోషిఫ్‌ ఆఫ్‌ ఇండియాపై బుధవారం కేంద్రం వేటు వేసింది. ఆయా సంస్థల విదేశీ సహకార నియంత్రణ చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ) లైసెన్స్‌లను రద్దు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఎఫ్‌సిఆర్‌ఎ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడంతో ఆ ఎన్‌జిఒలు విదేశాల నుండి నిధులను స్వీకరించలేవు, అందుబాటులో ఉన్న నిధులను కూడా వినియోగించుకునేందుకు అవకాశం ఉండదు. గత ఐదేళ్లలో కేంద్రం సుమారు 6,600 ఎన్‌జిఒలకు విదేశాల నుండి నిధులు అందకుండా ఎఫ్‌సిఆర్‌ఎను రద్దు చేసింది. పదేళ్లలో ఈ సంఖ్య 20,693గా ఉంది.

➡️