ఆస్తుల విలువ దాచిపెట్టిన బిజెపి అభ్యర్థి- ఇసికి కాంగ్రెస్‌ ఫిర్యాదు

Apr 8,2024 00:21 #Congress complaint, #EC

న్యూఢిల్లీ: మోదీ ప్రధాని అయ్యాక దేశంలో చోటుచేసుకున్న అవినీతి కుంభకోణాల్లో బిజెపి అగ్రస్థానంలో నిలిచింది. అంటే, అంతర్జాతీయ ఆర్థిక మోసాల కేసుల మొదలు సాధారణ స్థానిక పేలుళ్ల (రమేష్‌ వరం కాబే) ఘటనల వరకు, బిజెపి వ్యక్తుల పాత్ర లేకుండా ఏమీ జరగదు. దటీజ్‌ బిజెపి. ఇప్పుడు ఇంకో అంశంలో అది ఘనత సాధించింది. ఎన్నికల నామినేషన్లకు సంబంధించిన ఆస్తుల వివరాలతో కూడిన అఫిడవిట్‌లో బిజెపి అభ్యర్థులు అక్రమాలకు తెరతీశారు.
కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తన ఆస్తుల వివరాలతో కూడిన ఒక అఫిడవిట్‌ను నామినేషన్‌ పత్రంతోబాటు దాఖలు చేశారు. ఆ అఫిడవిట్‌లో 36 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. కానీ వాస్తవానికి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఆస్తులు దాదాపు రూ.8,000 కోట్లు అని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. అందులో ”కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్ర శేఖర్‌ ఆస్తుల విలువను దాచిపెట్టి రూ.36 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నట్లు చూపించారని, ఆయన చూపిన రూ.36 కోట్ల ఆస్తుల్లోలగ్జరీ కార్లు, విలాసవంతమైన బంగ్లా గురించి ఎక్కడా పేర్కొనలేదన్నారు. ఆయనకు దాదాపు రూ.8,000 కోట్ల ఆస్తులున్నాయని.రూ.6.3 కోట్లుగా చూపిన 4 కంపెనీల విలువ రూ.1,610 కోట్లుగా కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పేర్కొన్న విషయాన్ని , అలాగే. అతను తన స్వంత విమానం కూడా కలిగి ఉన్నారనే విషయాన్ని చంద్రశేఖర్‌ దాచిపెట్టారని కాంగ్రెస్‌ పార్టీ తన ఫిర్యాదులో పేర్కొంది.
రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఆస్తుల వివరాలు ఇప్పటికే పలు మీడియాల్లో ప్రచురితమయ్యాయి. కాబట్టి తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేసిన రాజీవ్‌ చంద్రశేఖర్‌ నామినేషన్‌ ను తిరస్కరించాలని కాంగ్రెస్‌ కోరింది. .రాజీవ్‌ చంద్రశేఖర్‌ లాగే పలువురు బిజెపి అభ్యర్థులు తమ ఆస్తులను దాచుకున్నట్లు సమాచారం

➡️