షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ

Feb 12,2024 11:10 #ap congress, #ys sharmila
Congress Election Committee headed by Sharmila

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (ఎపిపిసిసిి) అధ్యక్షులు వైఎస్‌ షర్మిల రెడ్డి నేతృత్వంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఎఐసిసి) ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. షర్మిల ఛైర్మన్‌గా 20 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సభ్యులుగా పార్టీ సీనియర్‌ నాయకులు ఎన్‌ రఘువీరా రెడ్డి, టి సుబ్బరామిరెడ్డి, పల్లం రాజు, కె రాజు, కెవిపి రామచంద్రరావు, గిడుగు రుద్రరాజు, ఎస్‌ శైలజానాథ్‌, చింతా మోహన్‌, జెడి శీలం, కె బాపిరాజు, ఎన్‌ తులసి రెడ్డి, షేక్‌ మస్తాన్‌ వలి, సుంకర పద్మశ్రీ, జంగా గౌతం, రాకేష్‌ రెడ్డి, సిరివెళ్ల ప్రసాద్‌, ఉషా నాయుడు, సూర్య నాయక్‌, శ్రీనివాస రెడ్డి ఉన్నారు. ఎపిపిసిసి అదనపు ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ఎన్‌ రాజా, కాంగ్రెస్‌ అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కూడా కమిటీలో సభ్యులుగా ఉంటారు.

➡️