రాజస్థాన్‌లో సిపిఎం విస్తృత ప్రచారం

 

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సిపిఎం అభ్యర్థుల ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. చురు జిల్లా తారానగర్‌లో కిసాన్‌ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నిర్మల్‌ కుమార్‌కు మద్దతుగా సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కరత్‌ ప్రచారం చేశారు. వివిధ సభల్లో పాల్గొని ప్రచారం చేశారు. నిర్మల్‌ కుమార్‌కు లభిస్తున్న బలమైన మద్దతును తగ్గించడానికి ఈ నియోజకవర్గంలో భారీగా డబ్బు ఖర్చు చేస్తూ ప్రైవేట్‌ బీమా కంపెనీ అనుకూల, కులతత్వ శక్తులు ముఠాగా ఉన్నాయని విమర్శించారు. బహిరంగ సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

➡️