39 మందితో సిపిఎం తొలి జాబితా

Mar 22,2024 07:52 #cpm first list, #Delhi

– కేరళలో 15, బెంగాల్‌లో 13 స్థానాలకు అభ్యర్థులు ఖరారు
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) గురువారం విడుదల చేసింది. రాష్ట్రాల వారీగా తొలి దశలో పోటీ చేసే స్థానాలను, అభ్యర్థుల వివరాలను వెల్లడించింది. తొలి జాబితాలో 39 మంది అభ్యర్థులను ప్రకటించారు. వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళలో 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, పశ్చిమ బెంగాల్‌లో 13 స్థానాలకు, తమిళనాడు 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అలాగే ఢిల్లీలో అన్నదాతల పోరాటాలకు కేంద్ర బిందువులుగా నిలిచిన పంజాబ్‌లో జలంధర్‌ (ఎస్‌సి) నుంచి, రాజస్థాన్‌లోని సికార్‌ నుంచి సిపిఎం అభ్యర్థులను బరిలో నిలిపింది. జలంధర్‌ నుంచి పురుషోత్తం లాల్‌ బిల్గా పోటీ చేస్తుండగా, సికార్‌ నుంచి అమ్రారామ్‌ పోటీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి జాబితాలో తెలంగాణలోని భువనగిరి స్థానం నుంచి మహ్మద్‌ జహంగీర్‌ను ప్రకటించారు. కోవిడ్‌ విపత్తులో వైద్య శాఖ మంత్రిగా విశేష సేవలందించి అంతర్జాతీయ సమాజ మన్ననలు పొందిన కెకె శైలజ టీచర్‌, ఆర్థిక వేత్త టిఎం థామస్‌ ఐజాక్‌, వ్యవసాయోద్యమ నాయకులు ఎ విజయరాఘవన్‌, ప్రముఖ పార్లమెంటేరియన్‌ ఎలమరం కరీం సహా జాతీయ స్థాయి కార్మిక, కర్షకోద్యమ నాయకులను సిపిఎం బరిలో నిలిపింది. తొలి జాబితాలో యువతకు కూడా ప్రాతినిధ్యం కల్పించారు. పశ్చిమ బెంగాల్‌లోని శ్రీరామ్‌పూర్‌ నుంచి విద్యార్థి ఉద్యమ నేత దిప్సితా ధర్‌ను బరిలో నిలిపారు.

సిపిఎం తొలి జాబితా

క్రమసంఖ్యా నియోజకవర్గాం అభ్యర్థి

1. కేరళ – కాసరగోడ్‌ – ఎంవి బాలకృష్ణన్‌ మాస్టర్‌
2.  కన్నూరు – ఎంవి జయరాజన్‌
3.  వడకర – కెకె శైలజా టీచర్‌ (మహిళ)
4.  కొజికోడ్‌ – ఎలమరం కరీం
5.  పొన్నాని – కెఎస్‌ హంస
6.  మలప్పురం – వి వసీఫ్‌
7.  అల్థూర్‌ (ఎస్‌సి) – కె రాధాకృష్ణన్‌
8.  పాలక్కడ్‌ – ఎ విజయరాఘవన్‌
9. ఛలక్కుడి – సి రవీంద్రనాథ్‌
10.  ఎర్నాకుళం – కెజె షైయీన్‌ టీచర్‌
11.  ఇడుక్కి – జోయస్‌ జార్జ్‌
12.  అలప్పుజ – ఎఎం ఆరిఫ్‌
13.  పతనాంతిట్ట – టిఎం థామస్‌ ఐజాక్‌
14.  కొల్లాం – ఎం ముకేష్‌
15. అట్టింగల్‌ – వి జోయ్
16. పశ్చిమ బెంగాల్‌ – జల్పారుగురి (ఎస్‌సి) – దేవరాజ్‌ బర్మన్‌
17.  కృష్ణానగర్‌ – ఎస్‌ఎం సాది
18.  డమ్‌డమ్‌ -సుజన్‌ భట్టాచార్య
19.  జాదవ్‌పుర్‌ – సృజన్‌ భట్టాచార్య
20.  కొల్‌కతా దక్షిణ – సైరా షా హలీమ్‌ (మహిళ)
21.  హౌరా – సవ్యసాచి ఛటర్జీ
22.  శ్రీరామపుర్‌ – దిప్సితా ధర్‌ (మహిళ)
23.  హూగ్లీ -మనోదీప్‌ సింగ్‌
24.  తుమ్లుక్‌ – సాయన్‌ బెనర్జీ
25.  బంకూర – నీలాంజన్‌ దాస్‌గుప్తా
26.  విష్ణుపుర్‌ (ఎస్‌సి) -సీతల్‌ కైబర్తా
27.  బర్ధ్వాన్‌ ఈడ్‌ పూర్వ (ఎస్‌సి) – నీరవ్‌ ఖాన్‌
28.  అసన్‌సోల్‌ – జహనర ఖాన్‌ (మహిళ)
29. త్రిపుర – త్రిపుర తూర్పు (ఎస్‌టి) ా రాజేంద్ర రేయాంగ్‌
30. రాజస్థాన్‌ – సికార్‌ – అమ్రా రామ్‌
31. తెలంగాణ – భువనగిరి – మహ్మద్‌ జహంగీర్‌
32. పంజాబ్‌ – జలంధర్‌ (ఎస్‌సి) – పురుసోత్తం లాల్‌ బిల్గా
33. తమిళనాడు – మదురై – సు వెంకటేశన్‌
34. తమిళనాడు – దిండిగల్‌ – ఆర్‌ సచిదానందం
35. అండమాన్‌ నికోబార్‌ దీవులు – అండమాన్‌ నికోబార్‌ దీవులు – డి అయ్యప్పన్‌
36. అస్సాం – బార్పేటా మనోరంజన్‌ తాలుక్దార్‌
37. బీహార్‌ – ఖగారియా – సంజయ్ కుమార్‌
38. జార్ఖండ్‌- రాజ్‌మహల్‌ (ఎస్‌టి) – గోపెన్‌ సోరెన్‌
39. కర్ణాటక- చిక్‌బల్లాపుర్‌ – ఎంపి మునివెంకటప్ప

➡️