రైతునేత అమ్రారామ్‌ను గెలిపించండి

  •  సికార్‌లో సచిన్‌పైలట్‌ పిలుపు

సికార్‌ : రైతునేత, సికార్‌ లోక్‌సభ సిపిఎం అభ్యర్థి అమ్రారామ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి సచిన్‌పైలట్‌ పిలుపునిచ్చారు. రాజస్థాన్‌లోని సికార్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధి పటాన్‌ పట్టణంలో సిపిఎం ఆధ్వర్యాన జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతు సమస్యలపై అమ్రారామ్‌ చేసిన ఉద్యమాలను ఆయన ప్రస్తావించారు. సభలో పలువురు ఇండియా వేదిక నాయకులు, స్థానిక ఎమ్మెల్యే సురేష్‌ మోడీ, దంతారాగఢ్‌ ఎమ్మెల్యే వీరేంద్ర సింగ్‌, అసెంబ్లీ మాజీ స్పీకర్‌ దీపేంద్ర సింగ్‌ షెకావత్‌ పాల్గొన్నారు.

➡️