మోడీపై కేసు నమోదు చేస్తాం : ఢిల్లీ సిపి

Apr 25,2024 07:18 #PM Modi, #police case

న్యూఢిల్లీ: ముస్లింలపై విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కేసు నమోదు చేస్తామని ఢిల్లీ సిటీ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందకరత్‌ ఫిర్యాదుపై కమిషనర్‌ స్పందిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. పోలీస్‌ కమిషనర్‌ పుష్పిందర్‌ గ్రేవాల్‌ వద్దకు నేరుగా వచ్చి బృందకరత్‌ ఈ ఫిర్యాదు చేశారు. న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని కమిషనర్‌ తెలిపారు.

➡️