నేడు ‘ఢిల్లీ ఛలో’కు అన్నదాతలు : రాజధానిలో నెల రోజుల పాటు సెక్షన్‌ 144 విధింపు

Feb 13,2024 10:13 #Delhi, #Delhi Chalo, #today

న్యూఢిల్లీ : మంగళవారం నాటి ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు రాజధానిలో 144 సెక్షన్‌ విధించారు. ఈ ఉత్తర్వులు సోమవారం నుండే అమలులోకి వచ్చాయి. మార్చి 12వ తేదీ వరకూ అమలులో ఉంటాయని తెలిపారు. 16వ తేదీన సంయుక్త కిసాన్‌ మోర్చ దేశవ్యాపిత గ్రామీణ బంద్‌, రంగాల వారి పారిశ్రామిక సమ్మెకు పిలుపునిచ్చిన దృష్ట్యా దానిపై ఉక్కుపాదం మోపాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం నిర్బధాన్ని తీవ్రతరం చేస్తోంది. 13వ తేదీ ‘ఢిల్లీ చలో’ కార్యక్రమం సాకుగా చూపి ముందస్తు నిర్బంధ చర్యలకు పాల్పడుతుంది. ఇటువంటి బెదిరింపులకు లొంగేది లేదని ఎస్‌కెఎం స్పష్టం చేసింది. 16వ తేదీన చేపట్టే ఆందోళనకు దేశవ్యాపితంగా రైతాంగం, కార్మిక వర్గం సమాయత్తమవుత్నాయి. ఢిల్లీ వెళుతున్న కర్నాటక రైతులను భోపాల్‌లో అరెస్ట్‌ చేయడాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖండించారు. వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. పలు రాష్ట్రాల నుండి రాజధాని వైపు వస్తున్న రైతులను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నట్లు వార్తలందుతున్నాయి. పంటలకు కనీస మద్దతు ధరలు కల్పిస్తామన్న హామీకి చట్టబద్ధత కల్పించాలని రైతులు ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు.

➡️