ముందుగానే రుతుపవనాలు..!

Apr 12,2024 08:08 #Heavy rain, #weather report

న్యూఢిల్లీ : రాబోయే వానాకాలం సీజన్‌లో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. ఎల్‌నినో పరిస్థితులు పూర్తిగా తొలగిపోయి.. లా నినా పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొంది. హిందూ మహాసముద్ర ద్విధ్రువ (ఐడిఒ) పరిస్థితులతోపాటు లానినా పరిస్థితులు ఏకకాలంలో యాక్టివ్‌గా మారుతుండడంతో రుతుపవనాలు ముందుగానే వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాల్లో మంచినీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజా సమాచారం అందరికీ ఊరటనిస్తోంది. రుతుపవనాల అల్పపీడనాలు పశ్చిమ, వాయవ్య భారతదేశం, ఉత్తర అరేబియా సముద్రంవైపు విస్తరించి స్థిరమైన పంథాను అనుసరిస్తాయని ఐఎండి భావిస్తున్నది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో వర్షపాతం పెరుగుతుందని, సాధారణ వర్షపాతానికి మించి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నది.

➡️