ఢిల్లీలో భూకంపం .. 6.1 గా నమోదు

Jan 11,2024 15:16 #Delhi, #Earthquake

న్యూఢిల్లీ   :     దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో గురువారం మధ్యాహ్నం భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.1 గా నమోదైంది. ఆఫ్ఘనిస్థాన్‌లో 220 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌కి ఈశాన్యంగా 241 కి.మీ దూరంలో భూకంప కేంద ఉన్నట్లు వెల్లడించింది.  దీంతో ఢిల్లీతో పాటు పంజాబ్‌, ఛండీగఢ్‌, ఘజియాబాద్‌లోనూ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జమ్ముకాశ్మీర్‌, పాకిస్థాన్‌లోనూ భూమి కంపించినట్లు వెల్లడించారు.

 

➡️