తమిళనాడులో ఘోర ప్రమాదం.. నలుగురు వైద్య విద్యార్థులు మృతి

Feb 22,2024 09:56 #Fatal road accident, #Tamil Nadu

చెన్నై : తిరువణ్ణామలై సమీపంలోని కిలిపెన్నత్తూరు ప్రాంతంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను కారు ఢీకొనడంతో నలుగురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. తిరువణ్ణామలై నుంచి తిండివనం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కిలిబెన్నత్తూరు పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరువణ్ణామలై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

➡️