ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం..

ఢిల్లీ : ఢిల్లీ ఎయిమ్స్‌లో గురువారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిమ్స్‌ ఆస్పత్రిలోని టీచింగ్‌ బ్లాక్‌ రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి.. అగ్ని ప్రమాదంలో ఫర్నీచర్‌, ఆఫీసు రికార్డులు దగ్ధం అయ్యాయి. సమాచరం అందకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది 7 అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఢిల్లీ ఫైర్‌ సర్వీస్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు.

 

➡️