Former IAF chief  : బిజెపిలో చేరిన బదౌరియా

Mar 24,2024 13:08 #BJP, #Former IAF chief

న్యూఢిల్లీ :   భారత వాయుసేన (ఐఎఎఫ్‌) మాజీ చీఫ్‌ ఆర్‌.కె.ఎస్‌. బదౌరియా బిజెపిలో చేరారు. ఐఎఎఫ్‌లో బదౌరియా సుదీర్ఘ సేవలందించారని, రక్షణ దళంలో చురుకైన పాత్ర పోషించారని బిజెపి ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్డే ప్రశంసించారు. రాజకీయ రంగంలోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. బదౌరియా సుమారు 40 ఏళ్లు ఐఎఎఫ్‌లో గడిపారని, ప్రధాని మోడీ ఆత్మ నిర్భర్‌ భారత్‌ కార్యక్రమానికి సహకారం అందించారని బిజెపి నేత చెప్పారు. ఆయన ఉత్తరప్రదేశ్‌కు  చెందినవాడు.

➡️