రిపబ్లిక్‌ డే పరేడ్‌ ముఖ్య అతిథిగా బైడెన్‌ స్థానంలో మాక్రాన్‌

న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ముఖ్య అతిథిగా మొదట ఆహ్వానించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ రావడం లేదని వైట్‌ హౌస్‌ తెలపడంతో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ను భారత్‌ ఆహ్వానించింది. జనవరి 26న ఢిల్లీలో జరిగే పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యే ఫ్రాన్స్‌ దేశాధినేతగా మాక్రాన్‌ ఆరో వ్యక్తి అవుతాడు. అయితే జో బైడెన్‌ ఎందుకు రావడం లేదనే దానిపై భారత్‌ లేదా అమెరికా స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. ఖలిస్థాన్‌ అనుకూల గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ గురించి అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. అమెరికా గడ్డపై పన్నూన్‌ను చంపేందుకు భారత్‌ ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఇరువైపులా పలు సందేశాలు పరస్పరం మారాయి. అయితే బైడెన్‌ ఎందుకు హాజరు కాలేదనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి నెలాఖరులో అమెరికా కాంగ్రెస్‌లో ఆయన ప్రసంగించనున్నారు. 2024లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి.

➡️