అద్వానీకి భారతరత్న : నెరవేరిన బిజెపి ఎజెండా : కవిత

న్యూఢిల్లీ : బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీని ‘భారత రత్న’ పురస్కారానికి ఎంపిక చేసి బిజెపి తన ఎజెండాను నెరవేర్చుకుందని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. శనివారం ప్రధాని మోడీ అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రామమందిరం ఎట్టకేలకు పూర్తయింది. ఆ తర్వాత అద్వానీజికి కూడా భారత రత్న ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా బిజెపి ఎజెండా నెరవేరింది. భారత రత్న అవార్డుకు ఎంపికైన లాల్‌ కృష్ణ అద్వానీకి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.’ అని ఆమె అన్నారు.

➡️