ప్రత్యామ్నాయ మీడియాపై మరిన్ని బరువు బాధ్యతలు

Jan 4,2024 09:20 #Alternative, #Media
ganashakti foundation day Sashi Kumar on alternative media
  •  గణశక్తి వ్యవస్థాపక వార్షికోత్సవంలో మీడియా నిపుణులు శశికుమార్‌

కొల్‌కతా: పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి సూచిక. దానిని పరి రక్షించుకోవాల్సిన అవసరమెంతైనా ఉందని ప్రముఖ మీడియా నిపుణులు శశి కుమార్‌ చెప్పారు. ‘ప్రభుత్వం చేస్తున్న పనిలో తప్పులుంటే వాటిని ఎత్తి చూపాల్సిన బాధ్యత కచ్చితంగా తేల్చాల్సిన బాధ్యత మీడియాపై ఉంది. కానీ నేడు పత్రికలు ప్రభుత్వానికి పెంపుడు జంతువుగా మారాయి. అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం కోల్‌కతాలో జరిగిన ‘గణశక్తి’ వ్యవస్థాపక వార్షికోత్సవంలో శశికుమార్‌ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోనప్పుడు పత్రికలు మీడియా క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. .పత్రికలు, సోషల్‌ మీడియాతోపాటు ప్రత్యామ్నాయ మాధ్యమాల్లోనూ ఫేక్‌ న్యూస్‌ ప్రబలుతోంది. ఈ పరిస్థితుల్లో బెంగాల్‌లోని ‘గణశక్తి’ లేదా కేరళలోని ‘దేశాభిమాని’ వంటి ప్రత్యామ్నాయ మీడియా అవసరం మరింత పెరిగిందని ఆయన అన్నారు. ప్రభుత్వ విధానాల్లోని లోటుపాట్లను ఎత్తి చూపినందుకు ‘న్యూస్‌ క్లిక్‌’ పై దాడులు జరిగాయని అన్నారు. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ఒక్కటే ఆధారం కాదు. పత్రికా స్వేచ్ఛ కూడా ముఖ్యమేనని అన్నారు. కోల్‌కతాలోని ప్రమోద్‌ దాస్‌గుప్త భవన్‌లో జరిగిన ‘ ఈ కార్యక్రమానికి బిమన్‌ బసు అధ్యక్షత వహించారు .సిపిఐఎం) రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ సలీం , ‘ గణశక్తి ‘ కార్యదర్శి షామిక్‌ లాహిరి మాట్లాడారు., ”రాయిటర్స్‌ , ఎఎఫ్‌పి వంటి వార్తా సంస్థలు 85 శాతం వార్తలను అందిస్తాయి. వారు అమెరికా దాని మిత్రదేశాలకు వ్యతిరేకంగా ఏదీ నివేదించరు . గాజాలో సంఘర్షణకు ముగింపు పలకాలని డిమాండ్‌ చేస్తూ లేదా ఇజ్రాయెల్‌ దాడులను నిరసిస్తూ చేసిన మార్చ్‌లు బ్లాక్‌ అయ్యాయి. లాహిరి మాట్లాడుతూ, ” మేము తటస్థంగా లేము, కష్టపడి పనిచేసే ప్రజల పక్షపాతిగా మేమున్నాం” అని అన్నారు.

➡️