ఉగ్రవాదులకు, వేర్పాటువాదులకు చోటు ఇవ్వకూడదు : జై శంకర్‌

Dec 23,2023 17:33 #Jaishankar

గాంధీనగర్ : అరికాలోని స్వామినారాయణ్‌ దేవాలయ గోడలపై రాసిన విద్వేష రాతలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖామంత్రి ఎస్‌. జైశంకర్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘స్వామి నారాయణ్‌ దేవాలయ గోడలపై ఖలిస్తానీ అనుకూల నినాదాలతో గ్రాఫిటీని నేను చూశాను. తీవ్రవాదులు వేర్పాటువాదుల వంటి శక్తులకు చోటు ఇవ్వకూడదు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేశాం. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అమెరికా అధికారులకు విజ్ఞప్తి చేశాం.’ అని ఆయన అన్నారు. కాగా, నెవార్క్‌లోని స్వామి నారాయణ ఆలయ గోడలపై ఖలిస్తానీ అనుకూల నినాదాలతోపాటు ప్రధాని మోడీ వ్యతిరేకంగా గ్రాఫిటీ చేసినట్లు హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ ఎక్స్‌లో పోస్టు చేసింది. గుడి గోడలపై ఖలిస్తానీ ఉగ్రవాది జర్నెయిల్‌ సింగ్‌ బింద్రాన్‌వాలే పేరు రాశారు. ఈ రాతలు భక్తులను భయాందోళనకు గురిచేస్తాయి. ఇది విద్వేషాలను రెచ్చగొట్టే చర్యల కిందకే వస్తుంది. ఈ రాతలపై పోలీసులు దర్యాప్తుల చేయాలని హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ ఎక్స్‌లో కోరింది.

➡️