ఈ సారి ఆ తప్పు చేస్తే నియంతత్వమే..

Dec 26,2023 10:50 #dictatorship, #Uddhav Thackeray
  •  ఉద్ధవ్‌ సంచలన వ్యాఖ్యలు..

ముంబయి  :    శివసేన(యుబిటి) చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే 2024 ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం నియంతత్వం ముందు ఉందని, మళ్లీ ఆ తప్పు (బిజెపిని ఎన్నుకోవడం) చేస్తే దేశంలో ఇక నియంతృత్వమే అని అన్నారు. భారతదేశ స్వేచ్ఛను రక్షించే సమయం ఆసన్నమైందని అన్నారు. తూర్పు ముంబైలోని కుర్లాలో సోమవారం జరిగిన ఒక సమావేశంలో జైన్‌ కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడుతు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం ప్రసుత్తం గడ్డుకాలం ఎదుర్కొంటోందని, ఈ సారి మనం తప్పు చేస్తే దేశం నియంతత్వంలోకి వెళ్తుందని, దేశాన్ని ఎవరు కాపాడుతారని ప్రశ్నించారు. పరోక్షంగా బిజెపిని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్య్రం కావాలని, ఒకప్పుడు స్వాతంత్య్రం కోసం పోరాడామని, ఇప్పుడు స్వేచ్ఛ కోసం పోరాడుతున్నామని, దేశంలో గందరగోళ వాతావరణం ఉందని, నియంతత్వం మన దరిదాపుల్లో ఉందని, దాన్ని మనం ఆపాలంటూ వ్యాఖ్యానించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి పొరబాట్లను చేయవద్దని ప్రజలను కోరారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇక్కడికి రాలేదని, దేశం కోసం వచ్చానని అన్నారు.

➡️