మాల్దీవుల రాయబారికి సమన్లు జారీ చేసిన భారత ప్రభుత్వం

న్యూఢిల్లీ :    మాల్దీవుల రాయబారికి భారత ప్రభుత్వం సోమవారం సమన్లు జారీ చేసింది. మాల్దీవుల రాయబారి ఇబ్రహీం షాహీబ్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. దీంతో ఆయన సోమవారం  ఉదయం రాయబార కార్యాలయానికి వచ్చి వెళ్లారు.   సోషల్‌ మీడియాలో ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా లక్షద్వీప్‌ను ప్రముఖ పర్యాటక ప్రాంతంగా రూపొందించేందుకు భారత్‌ యత్నిస్తోందని మాల్దీవుల మంత్రులు వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రధాని మోడీ లక్షద్వీప్‌ పర్యటించిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంపై మాల్దీవుల మంత్రులు పైవిధంగా స్పందించారు. దీంతో మాల్దీవుల ప్రభుత్వం ముగ్గురు మంత్రులు మరియం షివునా, మల్షా షరీఫ్‌, అబ్దుల్లా మజూంలను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

➡️