ఇన్‌శాట్‌-3డీఎస్‌ విజయవంతం

Mar 12,2024 11:04 #INSAT-3DS, #issro, #successful

బెంగళూరు : ఇస్రో ప్రయోగించిన వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్‌-3డీఎస్‌ ప్రయోగం సక్సెస్‌ అయింది. ఇన్‌శాట్‌ తాజాగా భూ చిత్రీకరణను ప్రారంభించింది. అందులోని 6-ఛానల్‌ ఇమేజర్‌, 19-ఛానల్‌ సౌండర్‌ ఒడిసిపట్టిన చిత్రాలను సంస్థ తాజాగా విడుదల చేసింది. 6-ఛానల్‌ ఇమేజర్‌. భూ ఉపరితలాన్ని, వాతావరణాన్ని బహుళ తరంగదైర్ఘ్యాల్లో చిత్రీకరించగలదు. 19-ఛానల్‌ సౌండర్‌ సాయంతో భూ వాతావరణం నుంచి వెలువడే రేడియోధార్మికతను పరిశీలించొచ్చు.

➡️