కవిత జ్యుడిషియల్‌ కస్టడీ 21 వరకు పొడిగింపు

Jun 7,2024 16:08 #judicial custody, #Kavitha

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కేసులో కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్‌ కస్టడీని ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ కేసులో కవితపై సిబిఐ శుక్రవారం సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ ఛార్జిషీటుపై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరిగింది. అనంతరం ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు కవిత జ్యుడిషియల్‌ కస్టడీని జూన్‌ 21 వరకు పొడిగించింది.

కాగా, ఈ సందర్భంగా కవిత జైలులో చదువుకోవడానికి తనకు 9 పుస్తకాలు కావాలని కోర్టును కోరింది. ఆమె విజ్ఞప్తిని కోరు కూడా అంగీకరించింది.

➡️