కేదార్‌నాథ్ హెలికాప్టర్ కు తప్పిన ప్రమాదం

May 24,2024 12:37 #helicopter accident

కేదార్‌నాథ్ : ఆరుగురు యాత్రికులు సహా ఏడుగురితో కూడిన హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా శుక్రవారం తెల్లవారుజామున కేదార్‌నాథ్ హెలిప్యాడ్ సమీపంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది. పైలట్‌తో సహా ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్ సౌరభ్ గహర్వార్ చెప్పిన వివరాల ప్రకారం.. హెలికాప్టర్ సిర్సీ హెలిప్యాడ్ నుండి కేదార్‌నాథ్‌కు బయలుదేరారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వెనుక మోటారులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనిని గమనించిన పైలట్‌ నిర్దేశించిన హెలిప్యాడ్ నుండి కొన్ని మీటర్ల దూరంలో ఉన్న గడ్డి మైదానంలో అత్యవసర ల్యాండింగ్‌  చేశాడు. దీంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.

పైలట్ కు ప్రశంసల వెల్లువ 

హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన పైలట్ పై పలువురు ప్రశంసించారు. సౌరభ్ గహర్వార్ మాట్లాడుతూ.. “పైలట్ కూల్‌గా ఉన్నాడు మరియు త్వరగా నిర్ణయం తీసుకున్నాడు, పెద్ద ప్రమాదాన్ని నివారించాడు” అని చెప్పారు.

➡️