సిబిఐ అరెస్టు, కస్టడీని సవాలు చేస్తూ ఢిల్లీ కోర్టుకు కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ :    సిబిఐ అరెస్టును సవాలు చేస్తూ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మూడు రోజుల సిబిఐ కస్టడీ విధిస్తూ జూన్‌ 26న ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా సవాలు చేశారు. సిబిఐ పిటిషన్‌ మేరకు జులై 12 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తున్నట్లు రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి సునేనా శర్మ శనివారం ఆదేశించిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్‌ విచారణకు సహకరించలేదని,  దర్యాప్తు, న్యాయం కోసం ఆయన జైలులో ఉండాలని పిటిషన్‌లో పేర్కొంది. 2024 మార్చిలో ముఖ్యమంత్రిని అరెస్ట్‌ చేసినప్పటికీ 2022 నుండి ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసు కొనసాగుతోందని పేర్కొంటూ జ్యుడీషియల్‌ కస్టడీ రిమాండ్‌ దరఖాస్తును కేజ్రీవాల్‌ తరుపున న్యాయవాది వ్యతిరేకించారు.

➡️