8న దేశవ్యాప్తంగా ‘కేరళ సంఘీభావ దినోత్సవం’

Jan 23,2024 11:29 #CITU, #Kerala Solidarity Day'

అనుబంధ సంఘాలకు సిఐటియు పిలుపు

ఇండియా న్యూస్‌ నెట్‌వర్క్‌, న్యూఢిల్లీ  :    ఫిబ్రవరి 8న దేశవ్యాప్తంగా ‘కేరళ సంఘీభావ దినోత్సవం’ నిర్వహించాలని తన అనుబంధ సంఘాలు, సమాఖ్యలకు సెంట్రల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (సిఐటియు) సోమవారం పిలుపు పిలుపునిచ్చింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేరళలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వంపై అనుసరిస్తు వివక్షకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 8న ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, మంత్రులు నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అదే రోజున దేశ వ్యాప్తంగా కేరళ సంఘీభావ దినోత్సవం నిర్వహించాలని సిఐటియు పిలుపు నిచ్చింది.

రాజ్యాంగం కల్పించిన రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు, సమాఖ్య వాదం రక్షణ కోసం ఈ సంఘీభావ దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రదర్శనలు నిర్వహించాలని సిఐటియు పిలుపు నిచ్చింది. రాజ్యాంగంలోని సమాఖ్య నిర్మాణంపై దాడులను, ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలపై కేంద్రం వివక్షను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా మని సిఐటియు ఈ సందర్భంగా తెలిపింది. గత ఏడాది ఆగస్టు 24న జరిగిన సెంట్రల్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ ఐక్య వేదిక జాతీయ సమావేశంలో సమాఖ్య నిర్మాణంపై జరిగే అన్ని రకాల దాడులను వ్యతిరేకించిన విషయా న్ని గుర్తు చేసింది. నిరంకుశ మోడీ పాలనకు వ్యతిరే కంగా తీవ్ర ప్రచారం నిర్వహించాలని తన అన్ని కమిటీలు, యూనిట్లుకు సిఐటియు పిలుపుని చ్చింది. కేరళలోని ఎల్‌డిఎఫ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కార్మిక,కర్షక, ప్రజా అనుకూల విధానాలను అనుసరిస్తోందని, అలాగే ప్రజా సంక్షేమం, ప్రభుత్వ సంస్థలను రక్షించడానికి గట్టిగా నిలబడుతోందని సిఐటియు తెలిపింది. కాబట్టి కేరళ సంఘీభావ దినోత్సవాన్ని భారీ స్థాయిలో నిర్వహిం చాలని తన అనుబంధ సంస్థలకు, సభ్యులకు సిఐటియు విజ్ఞప్తి చేసింది.

➡️