బెంగళూరు రేవ్‌ పార్టీ.. డ్రగ్స్‌ టెస్ట్‌లో 86 మందికి పాజిటివ్‌..

May 24,2024 08:32 #Bengaluru, #Rave Party

బెంగళూరు : బెంగళూరు ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్‌లో జరిగిన రేవ్‌ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డ్రగ్స్‌ టెస్టులో మొత్తం 86 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు నార్కోటిక్‌ టీమ్‌ తెలిపింది. మొత్తం 150 మంది రక్త నమూనాలను నార్కోటిక్‌ టీమ్‌ సేకరించగా.. అందులో 59 మంది పురుషులు, 27 మంది మహిళల రక్త నమూనాలో డ్రగ్స్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా నటి హేమకు కూడా పాజిటీవ్‌గా నిర్ధరాణ అయినట్లు సమాచారం. రక్త నమూనాలు పాజిటివ్‌గా తేలిన వారందరికీ సీసీబీ సమన్లు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

➡️