మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న ఖర్గే..

Jun 9,2024 14:49 #Mallikarjun Kharge, #PM Modi

న్యూఢిల్లీ :    ప్రధాని మోడీ ప్రమాణ స్వీకార కార్యమ్రానికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే హాజరుకానున్నట్లు ఆదివారం కాంగ్రెస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాలో ఆయన హాజరవుతారని వెల్లడించింది. శనివారం ‘ఇండియా ఫోరం’ నేతలతో చర్చలు జరిపిన తర్వాత కాంగ్రెస్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని  సమాచారం.

లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటి (సిడబ్ల్యుసి) రాహుల్‌గాంధీని కోరిన సంగతి తెలిసిందే.  భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటే బలమైన ప్రతిపక్షం అవసరమని, పార్లమెంటులో ప్రతిపక్ష నేత హోదాకు రాహుల్‌ గాంధీ సరైన వ్యక్తి అని సిడబ్ల్యుసి తీర్మానం చేసినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్‌ తెలిపారు.

అయితే రాహుల్‌ గాంధీ తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ తిరిగి ఎన్నికయ్యారు. విషయం తెలిసిందే. పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

➡️