మహువా మొయిత్రా అభ్యర్థనను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ  :    లంచం తీసుకున్నారంటూ తనపై వస్తున్న ఆరోపణలను అడ్డుకోవాలన్న టిఎంసి నేత మహువా మొయిత్రా అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు సోమవారం తిరస్కరించింది. పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు మహువాకు వ్యాపారవేత్త దర్శన్‌ హీనానందాని లంచాలు ఇచ్చారంటూ బిజెపి ఎంపి నిషికాంత్‌ దూబే, న్యాయవాది అనంద్‌ దేహద్రాయ్‌లు  ఆరోపించిన సంగతి తెలిసిందే.   ఈ ఆరోపణలపై గతేడాది డిసెంబర్‌లో ఆమె లోక్‌సభ నుండి బహిష్కరణకు గురయ్యారు.

మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగేందుకు రూ.2 కోట్లతో పాటు ‘విలువైన బహుమతులు’ తీసుకున్నారంటూ ఎథిక్స్‌ కమిటీ పేర్కొంది. పార్లమెంటరీ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యేందుకు పాస్‌వర్డ్‌ను కూడా ఇచ్చారంటూ ఆమెను లోక్‌సభ నుండి బహిష్కరించింది.

ఈ ఆరోపణలను మహువా మొయిత్రా తీవ్రంగా ఖండించారు. పాస్‌వర్డ్‌ను షేర్‌ చేయడమనేది ఎంపిల మధ్య సాధారణ అంశమని వాదించారు.

➡️