టిఎంసి ఎంపి మహువా మొయిత్రాకు మూడోసారి నోటీసులు

Jan 17,2024 17:00 #Mahua Moitra

న్యూఢిల్లీ : బహిష్కరణ వేటుకు గురైన తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి) ఎంపీ మహువా మొయిత్రాకు మరో షాక్‌ తగిలింది. ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని ఆమెకు బుధవారం డైరెక్టరేట్‌ ఆప్‌ ఎస్టేట్‌ (డివోఈ) మూడోసారి నోటీసులిచ్చింది. లోక్‌సభలో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణల మేరకు మహువాపై డిసెంబర్‌ 8వ తేదీన బహిష్కరణ వేటు పడింది. దీంతో ఆమెకు కేటాయించిన అధికారిక బంగ్లా సైతం రద్దైంది. వెంటనే జనవరి 7వ తేదీలోపు అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ ఆమెకు నోటీసు కూడా వెళ్లింది. ఈ విషయంపై ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఆమెకు అక్కడా ఎదురుదెబ్బ తగిలింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. జనవరి 7వ తేదీతో గడువు ముగియడంతో.. బంగ్లాలో ఎందుకు కొనసాగనివ్వాలో చెప్పాలంటూ.. మహువాకు డీవోఈ జనవరి 8వ తేదీన డివోఈ మరోసారి నోటీసులు పంపింది. ఈసారి కూడా మహువా నుంచి సమాధానం లేకపోవడంతో.. జనవరి 11వ తేదీ మరోసారి డివోఈ మరోసారి నోటీసులు పంపింది. దీంతో ఆమె డివోఈ ముందు హాజరై వివరణ ఇచ్చారు. అయితే ఆమె వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో బుధవారంనాడు డివోఈ తక్షణమే బంగ్లా ఖాళీ చేయాలని మరోసారి ఆమెకు నోటీసులు పంపింది. ఈసారి బంగ్లాను ఖాళీ చేయించేందుకు అధికారుల బృందాన్ని రంగంలోకి దింపనున్నట్లు కేంద్ర గృహనిర్మాణ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

➡️