Malegaon case : ప్రగ్యాఠాకూర్‌ని చీవాట్లు పెట్టిన ముంబయి ప్రత్యేక కోర్టు

Apr 3,2024 18:22 #Pragya Thakur, #special court

ముంబయి :   ముంబయి ప్రత్యేక కోర్టు బిజెపి ఎంపి ప్రగ్యాఠాకూర్‌ని చీవాట్లు పెట్టింది.  2008 మాలెగావ్‌ కేసులో ప్రధాన నిందితురాలైన ఆమె వరుసగా విచారణకు గైర్హాజరు కావడంతో బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.   అనారోగ్యం పేరుతో బుధవారం కూడా ఆమె విచారణకు హాజరుకాలేదు. ఏప్రిల్‌ 8వ తేదీకల్లా ఆమె ఆరోగ్య పరిస్థితిపై స్టేటస్‌ రిపోర్ట్‌ను సమర్పించాల్సిందిగా నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజన్సీ (ఎన్‌ఐఎ)ని ఆదేశించింది.

అనారోగ్య కారణాలతో బెయిల్‌ పొందిన ప్రగ్యా ఠాకూర్‌ .. క్రికెట్‌, బాస్కెట్‌ బాల్‌ ఆడటంతో పాటు డ్యాన్సులు చేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ఆస్పత్రిలో చేరానంటూ గతంలోనూ విచారణను తప్పించుకున్న ఆమె అదే రోజు ఓ కార్యక్రమానికి హాజరవడం గమనార్హం.

➡️