రాజ్యాంగ నిర్మాణాన్ని నాశనం చేసేందుకే : మమతా బెనర్జీ

కోల్‌కతా : రాజ్యాంగ నిర్మాణాన్ని నాశనం చేసేందుకే  కేంద్రం  ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’  పాలసీని రూపొందించిందని  పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం విమర్శించారు.  పాలక బిజెపి తీసుకువస్తున్న ఈ వివాదాస్పద, నియంతృత్వ పాలసీని   తిరస్కరిస్తున్నట్లు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘నేను నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తున్నాను. అలాగే మీ పాలసీని కూడా వ్యతిరేకిస్తున్నాను’ అని  పేర్కొన్నారు.

‘ఒకే దేశం -ఒకే ఎన్నిక’ పాలసీ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతోనే  రూపోందించారని దుయ్యబట్టారు. నిరంకుశత్వం ప్రజాక్షేత్రంలోకి ప్రవేశించేందుకు   ప్రజాస్వామ్య రూపమే ఈ పాలసీ అని  ధ్వజమెత్తారు.

➡️