Droupadi Murmu : నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు .. పలువురు నేతలు శుభాకాంక్షలు

Jun 20,2024 11:59 #birthday, #Droupadi Murmu

న్యూఢిల్లీ : నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె గురువారం ఉదయం ఢిల్లీలోని జగన్నాథ్‌ మందిర్‌కి వెళ్లారు. అధికారులు రాష్ట్రపతికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం జగన్నాథుడిని దర్శించుకున్న ముర్ము.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాగా, రాష్ట్రపతి ముర్ము పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ప్రధానితోపాటు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖామంత్రి అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, జెపి నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు రాష్ట్రపతి ముర్ముకి సోషల్‌మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

➡️