Maharashtra : మరాఠా రిజర్వేషన్లకు షిండే ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్

ముంబయి : మరాఠాలకు విద్యా, ఉద్యోగాల్లో ఓబిసి కేటగిరిలో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మనోజ్‌ జరాంగే నేతత్వంలో కొంతకాలంగా ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, వీరి డిమాండ్లను మహారాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించి జరాంగే శుక్రవారం నుంచి నిరాహారదీక్ష చేపట్టారు. ఈయన దీక్షకు మద్దతుగా వేలాదిమంది ముంబై దిశగా ర్యాలీ చేపట్టారు. దీంతో షిండే ప్రభుత్వం దిగొచ్చి జరాంగే డిమాండ్లను నెరవేర్చేందుకు అంగీకరించింది. దీంతో జరాంగే తన దీక్షను విరమించారు.

కాగా, కాలేజీల్లోనూ, ఉన్నత విద్యా సంస్థల్లోనూ, ఉద్యోగాల్లోనూ మరాఠా కమ్యూనిటీకి 50 శాతం రిజర్వేషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ మే 5, 2021న తీర్పునిచ్చింది. ఈ కమ్యూనిటీకి 50 శాతం రిజర్వేషన్లను కల్పించడానికి సరైన కారణం లేనందున రిజర్వేషన్లు కల్పించడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పటి నుంచి ఆ రాష్ట్రంలో మరాఠా కమ్యూనిటీకి ఓబిసి కేటగిరి కింద రిజర్వేషన్లు కల్పించాలనిఉద్యమం కొనసాగుతుంది.

➡️