గ్యాస్‌ ధర తగ్గింపు.. ఎన్నికల జిమ్మిక్కే : సుప్రియా సూలే

Mar 8,2024 11:38 #Supriya Sule

పూనే : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ వంటగ్యాస్‌ ధరను వంద రూపాయలు తగ్గించినట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్‌ ధరను తగ్గించడంపై ఎన్‌సిపి నాయకురాలు సుప్రియా సూలే తీవ్రంగా విమర్శించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే మోడీ ప్రభుత్వం ఇలాంటి జిమ్మిక్కులు చేస్తోంది అని ఆమె అన్నారు. శుక్రవారం సూలే మీడియాతో మాట్లాడుతూ.. ‘వంట గ్యాస్‌ ధర తగ్గించడం పట్ల నాకేమీ ఆశ్చర్యం లేదు. ఎన్నికల టైమ్‌ని బట్టే మోడీ గవర్నమెంట్‌ గ్యాస్‌ ధర తగ్గించింది. గత 9 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. మరి ఇంతకుముందు గ్యాస్‌ ధర తగ్గింపుపై ఎందుకు ఆలోచించలేదు. లోక్‌సభ ఎన్నికలపై వచ్చే ఐదారు రోజుల్లో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ధర తగ్గించింది. ఇదంతా రాజకీయం. ఎన్నికల ఎత్తుగడల్లో భాగమే.’ అని ఆమె అన్నారు. అంతకుముందు గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 430. ఆ ధరతో మోడీ గవర్నమెంట్‌ ఎందుకు పోల్చడం లేదు? అని ఆమె ప్రశ్నించారు. ఇక గ్యాస్‌ ధర తగ్గింపుపై కాంగ్రెస్‌ ఎంపి మాణికం ఠాగూర్‌ ‘జుమ్లా’ అంటూ మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

➡️