ఎంపిగా రషీద్‌ ఇంజనీర్‌ ప్రమాణ స్వీకారానికి ఎన్‌ఐఎ అనుమతి

Jul 1,2024 17:01

న్యూఢిల్లీ : ఉపా కేసులో జైలులో ఉండి ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీగా ఎన్నికైన జమ్ముకాశ్మీర్‌ అవామీ ఇత్తెహాద్‌ పార్టీ వ్యవస్థాపకుడు ఇంజనీర్‌ రషీద్‌ అలియాస్‌ షేక్‌ అబ్దుల్‌ రషీద్‌ ప్రమాణ స్వీకారానికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అనుమతించింది. ఈ నెల 5న ఆయన లోక్‌సభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రషీద్‌ మీడియాతో మాట్లాడకూడదని ఎన్‌ఐఎ షరతు విధించింది. ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టు ఈ నెల 2న తీర్పునివ్వనుంది. ఇంజనీర్‌ రషీద్‌ ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్నారు. యుఎపిఎ చట్టం కింద ఎన్‌ఐఎ 2019లో ఆయనను అరెస్టు చేసింది. ఈ ఎన్నికల్లో రషీద్‌ తరపున ఆయన కుమారుడు అబ్రర్‌ రషీద్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రషీద్‌ 2008, 2014లో జమ్ముకాశ్మీర్‌లోని లాంగేట్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

➡️