జాతీయ స్థాయిలో పీజీ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల

Dec 27,2023 17:28 #Indian student
ఢిల్లీ : జాతీయస్థాయిలో విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024కు నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబరు 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. 2024 జనవరి 24 రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పీజీ ఎంట్రన్స్ మార్చి 11 నుంచి 28 వరకు నిర్వహిస్తారు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ఓ ప్రకటనలో వెల్లడించింది.  ఈసారి పరీక్ష ఫీజు పెంచారు. జనరల్ కేటగిరీ విద్యార్థులకు రూ.1200, ఓబీసీ/ఎన్ సీఎల్/జనరల్/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులకు రూ.1000, దివ్యాంగులకు రూ.800, ఎస్సీ/ఎస్టీ/హిజ్రాలకు రూ.900 పరీక్ష ఫీజుగా నిర్దేశించారు.
➡️