ఆ 17 మందిలో ఒకరు తిరిగొచ్చారు !

Apr 19,2024 00:22 #A ship, #blockaded, #Iran

న్యూఢిల్లీ : ఇరాన్‌లో దిగ్బంధించిన నౌకలోని 17 మంది భారతీయ నౌకా సిబ్బందిలో ఒకరు స్వదేశానికి తిరిగివచ్చారు. కేరళలోని త్రిసూర్‌కు చెందిన ఆన్‌ టెస్సా జోసెఫ్‌ గురువారం కొచ్చిన్‌ అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకోగా, ఆమెకు స్థానిక అధికారులు స్వాగతం పలికారు. పోర్చుగల్‌ జెండాతో ఉన్న ఎంఎస్‌సి ఏరీస్‌ అనే నౌకను గత వారంతంలో ఇరాన్‌ దిగ్భంధించిన సంగతి తెలిసిందే. ఇందులో ఉన్న మిగిలిన 16 మంది భారతీయ సిబ్బందిని స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది.

➡️