పిసి సర్కార్‌ ను విచారించిన ఇడి

Dec 23,2023 11:01 #investigated by ED, #PC Sarkar

కొల్‌కతా: ప్రఖ్యాత ఇంద్రజాలికుడు పిసి సర్కార్‌ (జూనియర్‌)ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఇడి) శుక్రవారం విచారించింది. సర్కార్‌ను సాల్ట్‌ లేక్‌లోని తన కార్యాలయానికి పిలిపించుకున్న ఇడి అధికారులు పిన్‌కాన్‌ గ్రూప్‌, టవర్‌ ఇన్ఫోటెక్‌ లిమిటెడ్‌గా కేంద్ర ఏజెన్సీలు గుర్తించిన రెండు కంపెనీలకు సంబంధించిన స్కామ్‌లలో ఆయన ప్రమేయం గురించి ప్రశ్నించారు. 790 కోట్ల రూపాయలకు పైగా మదుపరులను మోసగించిన చిట్‌ ఫండ్‌ మోసానికి సంబంధించి కొనసాగుతున్న విచారణలో భాగంగా సర్కార్‌ను ప్రశ్నించినట్లు ఒక అధికారి తెలిపారు.శుక్రవారం మధ్యాహ్నం సర్కార్‌ సాల్ట్‌ లేక్‌లోని ఇడి కార్యాలయానికి చేరుకున్న వెంటనే ఇడి అధికారులు ప్రశ్నించారు. ఈ కుంభకోణాల్లో ఆయనకు ఏదైనా ప్రమేయం ఉందా లేదా అనేది మేము కనుగొనవలసి ఉంది” అని ఇడి అధికారి పిటిఐ కి తెలిపారు. కొద్ది రోజుల క్రితం టవర్‌ గ్రూప్‌కు చెందిన సీనియర్‌ అధికారిని ఇడి అదుపులోకి తీసుకుందని, అతనిని గ్రిల్‌ చేస్తున్నప్పుడు సోర్కార్‌ పేరు బయటపడిందని అధికారి తెలిపారు. 2021లో ఇదే కేసుకు సంబంధించి సర్కార్‌ బాలిగంజ్‌ నివాసంలో సిబిఐ సోదాలు నిర్వహించింది.

➡️