రాష్ట్రానికి తొమ్మిది పోలీస్‌ మెడల్స్‌

Jan 25,2024 21:56 #Delhi, #medals, #Republic Day 2024

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కేంద్ర హోంశాఖ ప్రకటించిన పోలీస్‌ మెడల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తొమ్మిది పతకాలు వరించాయి. దేశ వ్యాప్తంగా పోలీస్‌, ఫైర్‌ సర్వీస్‌, హోంగార్డు, సివిల్‌ డిఫెన్స్‌, కరెక్షనల్‌ సర్వీస్‌లకు చెందిన 1,132 మంది సిబ్బందికి కేంద్రం శౌర్య/సేవా పతకాలను ప్రకటించింది. ఇద్దరికి మరణానంతరం ప్రెసిడెంట్స్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ (పిఎంజి), 275 మందికి మెడల్స్‌ ఫర్‌ గ్యాలంట్రీ (జిఎం), 102 మందికి విశిష్ట సేవ కోసం రాష్ట్రపతి పతకాలు (పిఎస్‌ఎం), 753 మందికి మెరిటోరియస్‌ సర్వీస్‌ మెడల్స్‌ (ఎంఎస్‌ఎం) పతకాలు ప్రకటించింది. ఇందులో ఎపికి మెడల్స్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌ (ఎంఎస్‌ఎం)లో తొమ్మిది మెడల్స్‌ దక్కాయి. వెంకట ప్రేమ్‌ జిత్‌ కోటనాని (కమాండెంట్‌), ఆవుల చెన్నయ్య (ఆర్‌ఎస్‌ఐ), రమణరెడ్డి (ఎఎస్‌ఐ), వెంకటేశ్వర్లు అద్దంకి (సిఐ), ప్రకాశ్‌ రావు (ఎఎస్‌ఐ), మస్తాన్‌రావు (ఎఎస్‌ఐ), వెంకట సత్య అనంత దుర్గ ప్రసాద్‌రావు (అసిస్టెంట్‌ కమాండెంట్‌), హరిరావు అక్కిశెట్టి (సిఐ), ఇ కోటిరెడ్డి (డిఎస్‌పి) ఎంఎస్‌ఎం పతకాలు సాధించారు.

➡️