ఇటలీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడి

ఇటలీ : ఇటలీ పర్యటన ముగించుకొని ప్రధాని మోడి తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. ఇటలీలో జి 7 దేశాల అవుట్‌ రీచ్‌ సదస్సుకు హాజరైన మోడి… వివిధ దేశాధినేతలతో సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌ స్కీ తదితరులతో మోడి అనేక అంశాలపై చర్చలు జరిపారు. దేశంలో ఎన్డీయే కూటమి మూడో పర్యాయం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రధాని మోడి చేపట్టిన మొదటి విదేశీ పర్యటన ఇదే. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడిని ప్రపంచ దేశాల నేతలు అభినందించారు. ఇటలీ పర్యటనపై ప్రధాని మోడి స్పందిస్తూ … జి 7 సదస్సు కేంద్రబిందువుగా సాగిన ఈ పర్యటన ఎంతో ఫలప్రదంగా జరిగిందని వివరించారు. భవిష్యత్‌ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించే దిశగా నేతలందరూ ప్రతిన బూనారని వివరించారు. ఘనమైన ఆతిథ్యం అందించిన ఇటలీ ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు కఅతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.

➡️